30 July, 2026 | 3:29 PM

కొత్తగా ఎన్నికైన సభ్యులకు ప్రధాని స్వాగతం

24-06-2024 10:56 AM

ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం

2047 వికసిత్ భారత్ సంకల్పం దిశగా సాగుతాం

న్యూఢిల్లీ: కాసేపట్లో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ప్రధాని మోడీ స్వాగతాభినందనలు తెలిపారు. 2047 వికసిత్ భారత్ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుదామని ప్రధాని పిలుపునిచ్చారు. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతామన్నారు. మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారన్న ప్రధాని సభ్యులందరినీ కలుపుకుని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రజలు తమ విధానాలను విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని ప్రధాని తెలిపారు. రాజ్యంగ ప్రొటోకాల్స్ పాటిస్తామన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని చెప్పారు. అత్యయిక పరిస్థితికి రేపటి 50 ఏళ్లు పూర్తవుతాయన్నారు. అత్యయిక పరిస్థితి ఒక మచ్చ. 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు అని ప్రధాని పేర్కొన్నారు.