విలువలు నేర్పే చిత్రాలు మరిన్ని రావాలి
దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరానికి చేరవేసే కథాంశంతో రూపొం దిన ఈ చిత్రం ‘అఖండ2’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ ప్రశంసించారు. ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించాలం టూ దర్శకుడు బోయపాటి శ్రీనును ఆశీర్వదించారు.
సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన చిత్రాలు మరింతగా రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ.. “-దేశం, ధర్మం, దైవం వంటి మూల విలువలను నేటి తరానికి గుర్తు చేయాలనే సంకల్పంతో ’అఖండ2’ను రూపొందించాం. ఈ ప్రయత్నానికి మోహన్ భగవత్ జీ ఆశీర్వాదం లభించడం మా టీమ్‌కు అపారమైన గౌరవం. ఇది మాకు మరింత బాధ్యతను, స్ఫూర్తిని ఇచ్చింది” అన్నారు.




