calender_icon.png 14 December, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలాన్ని చదివేందుకు పీరియాడిక్ చిత్రాలు చేస్తా

14-12-2025 01:05:50 AM

రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది ఆర్ట్ కియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ అయ్యాయి. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ విలేకరులతో చిత్ర విశేషాలు పంచకున్నారు. “-స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగే కథలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి.

ఆ చిత్రాల్లో బ్రిటీషర్స్‌తో జరిగిన పోరాటాన్ని చూపించారు. కానీ ‘ఛాంపియన్’ చాలా ప్రత్యేకం. ఇందులో ఎక్కువగా నిజాం బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. ఆ కాలపు గ్రామాలు, ప్రజల భావోద్వేగాలను చాలా విభిన్నంగా చూపించారు. పీరియడ్ సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక టైమ్ నుంచి మరో టైమ్‌లోకి వెళ్లి ఆ కాలాన్ని చదవడమనేది ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా కూడా అలాంటి అనుభూతిని ఇచ్చిన సినిమానే. ‘-ఛాంపియన్’ మ్యూజిక్ విషయానికి వస్తే తెలంగాణ జానపదంతోపాటు వెస్ట్రన్ మ్యూజిక్‌ను మిళితం చేసి ఒక జానర్ క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది.

ఇలాంటి మ్యూజిక్ క్రియేట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇది స్పోరట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమానే కానీ కథపరంగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో హీరోది సికింద్రాబాద్. ఆయన మాట్లాడే యాస చాలా విభిన్నంగా ఉంటుంది.

నేను కూడా సికింద్రాబాద్‌లోనే పెరిగా. నాకు ఆ సంస్కృతిపై అవగాహన ఉంది. నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా ఉన్నా. చాలా మంచి ఆల్బమ్స్ ఇచ్చా. బాలసుబ్రహ్మణ్యం, సీతారామశాస్త్రి, వేటూరి లాంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేశా. శేఖర్ కమ్ముల, హరీశ్‌శంకర్, శ్రీను వైైట్ల,  శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్.. ఇలా ఎంతో మంది డిఫరెంట్ క్రియేటర్స్‌తో జర్నీని చాలా ఎంజాయ్ చేశా. ఏ ప్రాజెక్టు వస్తే ఆ జానర్‌కు తగ్గ మ్యూజిక్ చేయాలనుకుంటా.