ఐక్యతతోనే దేశాభివృద్ధి సాధ్యం
మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్
కొత్తూరు, మార్చి 4 (విజయక్రాంతి): దేశ ప్రజలంతా ఐక్యమత్యంతో ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, భారతీయులు ఐక్యంగా ఉంటే ప్రపంచంలో ఏ శక్తీ మన దేశ పురోగతిని అడ్డుకోలేదని కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు.బుధవారం హోలీ పండుగను పురస్కరించుకుని కొత్తూరు మున్సిపాలిటీలోని చైర్ పర్సన్ నివాసంలో వేడుకలు అంబరాన్నంటాయి.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలను, పండుగల పరంపరను ఎవరూ అడ్డుకోలేరని ఆమె స్పష్టం చేశారు. రంగుల పండుగ హోలీ మనందరి మధ్య ఉన్న బేధాలను తొలగించి, ఐక్యతను చాటుతుందని ఆమె పేర్కొన్నారు.చైర్ పర్సన్ నివాసంలో జరిగిన వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘హోలీ హోలీల రంగా హోలీ.. చమ్మకేలీ హోలీ‘ అంటూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్ స్వయంగా మహిళలతో కలిసి రంగులు పూసుకుని వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, మున్సిపల్ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




