పారిశుద్ధ్య పనులు ముమ్మరం
24-06-2026 03:02 PM
వాంకిడి, (విజయక్రాంతి): వర్షాకాలం మొదలైన సందర్భంగా వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. ఇందిరానగర్ కాలనీ, పాత పోస్ట్ ఆఫీస్ కాలనీతో పాటు మరికొన్ని కాలనీల్లోని మురుగుకాల్వల్లో పెరుకుపోయిన మొరుగును తొలగించి ట్రాక్టర్ తో డంపింగ్ యార్డ్ కు తరలించారు. ఈ సందర్భంగా వాంకిడి సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.






