యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్
24-06-2026 02:50 PM
కూసుమంచి, (విజయక్రాంతి): యువత, విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ పాడవుతుందని కూసుమంచి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంజీవ్ సూచించారు. బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయం పాలేరు పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ మీద అవగాహన మీటింగ్ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కూసుమంచి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంజీవ్, కూసుమంచి తహసీల్దార్ సైదులు, కూసుమంచి ఎస్ఐ నాగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






