ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
11-08-2025 04:53 PM
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలోని వివేకానంద హై స్కూల్ పాఠశాలలో సోమవారం ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ మమత ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. మనిషి జీర్ణాశయ గోడలను అంటుకొని నులిపురుగుల, కుంకి పురుగులు, ఎలుక పాములు, పరాన్న జీవులు ఉంటాయని తెలిపారు. మనిషి భుజించిన ఆహారాన్ని తిని శారీరకంగా ఎదగాకుండా అనారోగ్యం కలుగజేస్తాయని తెలిపారు. నులిపురుగుల నిర్మూలనకు 400 ఎంజి మాత్రలను వేసుకోవడం ద్వారా నులిపురుగులను నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.






