calender_icon.png 11 August, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్..

11-08-2025 04:51:45 PM

దేవరకొండ: చింతపల్లి మండలంలోని మాల్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చామల ఫీలింగ్స్ స్టేషన్ ను సోమవారం దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్(MLA Balu Naik) ముఖ్య అతిథిగా హాజరై పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రజావసరాలకు అనుగుణంగా వ్యాపార సంస్థలు నెలకొల్పడం అభినందనీయమన్నారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ లను అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బంక్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.