24 June, 2026 | 1:02 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

19-11-2025 07:45 PM

గద్వాల: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు ఆదేశాలతో (బుధవారం ) శ్రీ. సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో  విద్యార్థినిలకు ముగ్గుల పోటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి గారు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ... ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ ప్రశంసించారు.

విద్యార్థులు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వివిధ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రగతి విద్యానికేతన్  స్కూల్, కాకతీయ టెక్నో స్కూల్, విశ్వేశ్వరయ్య మెమోరియల్ హై స్కూల్, శారద హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, విద్యార్థినీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.