calender_icon.png 19 November, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను తక్షణ పరిష్కారం పొందే విధంగా కృషి చేయాలి

19-11-2025 07:49:50 PM

జిల్లా కలెక్టర్ సంతోష్

గద్వాల: భూ భారతి క్రింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, తక్షణ పరిష్కారం పొందే విధంగా జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను  ఆదేశించారు. బుధవారం అలంపూర్ మండలంలోని ఉట్కూర్ గ్రామంలోని 151 సర్వే భూభారతి కింద పట్టు పాస్ బుక్ లేని సమస్యతో దరఖాస్తు చేసిన స్థానికులను జిల్లా కలెక్టర్  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పూర్తి వివరాలను సమగ్రంగా కలెక్టర్ కి తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భూభారతి రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం పాస్ బుక్ లేని అభ్యర్థుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తు పూర్వ రికార్డ్స్, సర్వే డాక్యుమెంట్లు, ఫీల్డ్ సర్వే ఆధారంగా తేల్చి, పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి కింద ఈ ప్రక్రియల్లో న్యాయపరమైన విధానం, పారదర్శకత, సమగ్రత కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మంజుల, రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.