09-12-2025 06:11:34 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య..
మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ నెల 21న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య కోరారు. మంగళవారం జిల్లా ప్రధాన న్యాయస్థానంలో న్యాయవాదులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ లను నిర్వహిస్తున్నామన్నారు. ఇరుపక్షాలతో మాట్లాడి ఎక్కువ సివిల్ కేసులను రాజీకి మార్గం వైపు మళ్లించేలా సూచించాలన్నారు.
మోటర్ వాహన నష్టపరిహారం ఎన్ఐ యాక్ట్, క్రిమినల కేసులు, సివిల్ ధావాలు పరిష్కరిష్కరించుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కాంపౌండ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు తగిన సహకారం అందించాలని కోరారు. కక్షిదారులకు ఈ లోక్ అదాలత్ గురించి వివరించి వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు సమన్వయంతో సహకారం అందిచాలన్నారు. ఇందు కోసం న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే తగిన న్యాయ సలహా సహాయాలు సైతం అందిస్తామని వెల్లడించారు. ఈ సమన్వయ సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఏ నిర్మల, ఉపాధ్యక్షులు భుజంగరావు, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.