calender_icon.png 9 December, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక పద్ధతుల్లో డంపింగ్ యార్డ్ వ్యర్థాల తొలగింపు

09-12-2025 06:15:21 PM

మున్సిపల్ కమిషనర్..

తాండూరు (విజయక్రాంతి): మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో వ్యర్థాలను ఆధునిక యంత్రం ద్వారా తొలగిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. మంగళవారం ఆయన అంతారం గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ లోని బయోమైనింగ్ ఆధునిక యంత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయో మైనింగ్ అనేది చెత్త నిలవలను శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచే ఆధునిక విధానమని.. వ్యర్థాలను ఆధునిక యంత్రాల సహాయంతో వడకట్టి తిరిగి ఆ వ్యర్థాలను ఉపయోగించగల పదార్థాలను వేరు చేసే ప్రక్రియ యంత్రంలో ఉందని చెప్పారు.

ఈ ప్రక్రియలో మట్టి, ప్లాస్టిక్, ఇనుము, గాజు, పరిశ్రమల్లో ఉపయోగపడే ఆర్డిఎఫ్ వంటి విలువైన పదార్థాలు తిరిగి పొందపడతాయని.. ఈ ప్రక్రియ ద్వారా బయో మైనింగ్ తో డంపింగ్ యార్డ్ పరిమాణం తగ్గి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. భూ, వాయు కాలుష్యాలు తగ్గడంతో పాటు చెత్త దుర్వాసన, దోమల సమస్యలు తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఇది స్వచ్ఛమైన, సుస్థిరమైన పట్టణాల నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. కమిషనర్ వెంట డిఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఎం వెంకటయ్య, జవాన్లు తదితరులు ఉన్నారు.