25 March, 2026 | 12:22 AM

రాజీ మార్గమే రాజమార్గం

24-03-2026 10:39 PM

ఈ నెల 28 వరకు జాతీయ లోక్ అదాలత్

కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

జిల్లా ఎస్పీ నితిక పంత్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా ప్రజలు న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా ఎస్పీ  నితిక పంత్ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ నెల 28 వరకు జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు పాల్గొని తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

ట్రాఫిక్ చలానాలు, చిన్నపాటి క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు వంటి అనేక కేసులను లోక్ అదాలత్ ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పక్షాల అంగీకారంతో శాంతియుతంగా పరిష్కరించే మంచి అవకాశం లోక్ అదాలత్ అని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.