11 June, 2026 | 4:10 PM

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

11-06-2026 03:28 PM

నాగిరెడ్డిపేట్,జూన్ 11 (విజయక్రాంతి): మండలంలోని రాఘవపల్లి గ్రామానికి చెందిన చింతలపల్లి రాజుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశంసారం రాఘవపల్లి గ్రామానికి చెందిన చింతలపల్లి రాజుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 18,500 చెక్కును పంపిణీ చేసినట్లు తెలిపారు.ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పేద ప్రజలకు అందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నార్ల గంగమణి మల్లేష్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగుల మోహన్,మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమా శ్రీరామ్ గౌడ్,గ్రామ ఉపాధ్యక్షులు గోవిందు బలరాం రెడ్డి, కోఆర్డినేటర్ కమిటీ మెంబర్ ఫిరంగి బాలయ్య,మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పసులాది క్రిష్టఫర్, నాయకులు రవీందర్,చాకలి గంగయ్య,మణిగిరి లక్ష్మణ్ కొండ తదితరులు పాల్గొన్నారు.