భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వివేకానంద చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు గుండి గ్రామం దారి వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ... భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల త్యాగాలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని అన్నారు.
నూతన విద్యా విధానం 2020ను రద్దు చేయాలని, జిల్లాలో గంజాయి డ్రగ్స్‌ను నిర్మూలించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గుండి గ్రామం దారిలో భగత్ సింగ్ చౌక్ ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, దుర్గం దినకర్, జాదవ్ రాజేందర్, హరి, మధుకర్, వంశీ, కిషోర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.




