4 September, 2026 | 10:46 AM

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 16,460 కేసుల పరిష్కారం

15-06-2025 | 12:44pm

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలత్(National Mega Lok Adalat) లో వివిధ రాజీ పడదగిన కేసులలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం, రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి  శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో జిల్లా పరిధిలో 16, 460 కేసులు పరిష్కారమయ్యాయని  నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్(Nalgonda SP Sharat Chandra Pawar) ఆదివారం తెలిపారు.

రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించారని తెలిపారు. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన అండర్ ఇన్వెస్టిగేషన్  కోర్టు విచారణలో ఉన్న ఐపిసి  కేసులు 706, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎంవి ఏ సిటీ   యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 4695,ఈ పెట్టి కేసులు  11026,సైబర్ క్రైమ్ కేసులు 33 లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని,కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ  అభినందించారు.