ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నిరసన సెగ
15-06-2025 | 12:48pm
ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీ పై విచారణకు డిమాండ్
భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): గత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Teacher MLC Elections) ఎన్నడూ లేని విధంగా మద్యం, డబ్బులు పంపిణీ నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు(Teachers unions) డిమాండ్ చేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ లోని బొల్లోరు గూడెం లో గల టిటిడి కళ్యాణ మండపంలో పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డికి నిరసన సభ ఎదురైంది. ఎన్నికల్లో మద్యం డబ్బులు పంపిన విచారణ చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.






