ఖమ్మంపల్లిలో అధికారుల కనుసైగల్లో ఇసుక అక్రమ దందా..?
- శనివారం అర్ధరాత్రి పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేసిన అధికారులు
- రాత్రి పగలు అని తేడా లేకుండా జోరుగా ఇసుక అక్రమ రవాణా...
- చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ముత్తారం,(విజయక్రాంతి): అధికారుల కనుసైగల్లో ఖమ్మంపల్లిలో ఇసుక ద అక్రమ దందా నడుస్తుందా... అంటే అవుననే సమాధానం చెబుతున్నారు గ్రామస్తులు. శనివారం అర్ధరాత్రి గ్రామములో ఇసుక అక్రమ తరలిస్తున్నారని, పోలీసులకు సమాచారం పోగా, వెంటనే స్పందించిన పోలీసులు ఖమ్మంపల్లికి చేరుకొని ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా, ఓ నాయకుడు వచ్చి నాన హంగామా చేసి టాక్టర్ల ను తీసుకెళ్లాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణా అధికారులకు కనుసైగలోనే నడుస్తుందని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంపల్లి మానేరు నుంచి రాత్రి పగలు అని తేడా లేకుండా జోరుగా అక్రమ రవాణా జరుగుతున్న... అధికారులుచోద్యం చూస్తున్నారని, రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అసలు విధులు నిర్వహిస్తున్నారా... అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో గ్రామానికి చెందిన కొంతమంది ఇసుక దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుపుతున్నారు. ఇప్పటికి ఇసుక దందాలో లక్షల్లో సంపాదించిన బడా, చోటా నాయకులు అధికారులను మచ్చిగా చేసుకొని ఈ దందాను సాగిస్తున్నారని గ్రామస్తులే తెలుపుతున్నారు. ఖమ్మంపల్లి క్వారీకి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకున్న అక్రమంగా మానేరు నుంచి ఇసుకను తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఖమ్మంపల్లి పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుచేసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.






