15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

28-02-2026 07:06 PM

నంగనూరు,(విజయక్రాంతి): విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించే లక్ష్యంతో శనివారం మండల పరిధిలోని  పలు పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్ అధ్యక్షతన భారతీయ శాస్త్రవేత్తల ఫోటోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిత్య జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరిస్తూ, ప్రతిభా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డి, గిరి తిరుపతి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దాసరి సుధాకర్ ఆధ్వర్యంలో విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. మన చుట్టూ జరిగే సంఘటనల వెనుక ఉన్న సైన్స్‌ను విశ్లేషించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్కినపల్లి పిఎంశ్రీ మోడల్ స్కూల్లో...

మండల పరిధిలోని అక్కెనపల్లిలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ మంద జానయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్ సి.వి. రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణ ప్రపంచ విజ్ఞాన శాస్త్రంలో మైలురాయి అని కొనియాడారు. సీనియర్ అధ్యాపకులు డా. ఎస్. శ్రీనివాస్, పవన్ కుమార్ తదితర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు,ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.