28 February, 2026 | 8:56 PM

కేరళ మోడల్ హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్

28-02-2026 07:00 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కేరళ మోడల్ హై స్కూల్‌లో శనివారం సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిజు ఎస్ నాయర్, ఉపప్రధానోపాధ్యాయులు స్మితా ఎస్.నాయర్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. తల్లిదండ్రులు విద్యార్థుల సృజనాత్మకతపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.