8 July, 2026 | 8:57 PM

ఘనంగా జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం

30-08-2024 08:13 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు విద్యార్థులకు చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపల్ పత్తి సునిత, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ జి అనూష, కామర్స్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.