calender_icon.png 30 January, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీ దరఖాస్తుల ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన ఏడిఏ ఎల్లయ్య

30-08-2024 08:07:40 PM

కోదాడ, (విజయక్రాంతి): రుణమాఫీలో భాగంగా మండలంలో రైతు రుణమాఫీ రాని రైతులు కరివిరాల రైతు వేదికలో వ్యవసాయ అధికారులు స్వీకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియను కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ... రుణమాఫీ వర్తించని రైతులు అధైర్య పడవద్దని, రైతుల ఆధార్ లో తప్పులు సవరణ, రైతుల నుండి సేకరించిన దరఖాస్తులు, పై అధికారులకు రోజువారిగా డేటా పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతు రైతుల నుండి స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ వ్యవసాయ అధికారి దేవ వరప్రసాద్, ఏఈఓ రేణుక, ఉప్పయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.