22 March, 2026 | 2:59 PM

మియాపూర్‌ అత్యాచారయత్నంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

04-07-2024 09:33 PM

హైదరాబాద్: మియాపూర్‌లో యువతిపై జరిగిన అత్యాచారయత్నంను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తను ఆదేశించింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో కమిషన్ పేర్కొంది. నిందుతులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.  ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ యువతి(25) ఉద్యోగం కోసం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు వచ్చింది. ఉప్పల్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ జేఎస్‌ఆర్ సన్‌సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా జాయిన్ అయింది.  అదే కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా  పని చేస్తున్న సంగారెడ్డి, జనార్ధన్ అనే ఇద్దరు వ్యక్తులు కూల్ డ్రింక్స్, స్వీట్స్‌లో మత్తుమందు కలిపి ఆమెపై  అత్యాచారానికి పాల్పడ్డారు.