ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య
22-03-2026 02:38 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. అప్పుల బాధతో మూడు రోజుల క్రితం రైతు గణపతి ఆత్మహత్య చేసుకున్నారని, ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ)కి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ తెలిపారు. రైతు గణపతి పంటను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదని ఆవేదనతో చనిపోయారని, ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య అని ఆయన విమర్శించారు.




