17 April, 2026 | 7:24 PM

క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు

03-05-2025 02:04 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 

కామారెడ్డి, మే 2 (విజయ క్రాంతి) క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశా నీకి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్  ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రజలు మనల్ని నాయకులుగా ఉంచినందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని అన్నారు, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు.

ఈరోజు బిఆర్‌ఎస్, బీజేపీ నాయకులు  జిల్లాకు చేసిందేమీ లేదు అన్నారు. ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు త్రాగు సాగు నీరు అందాలని ప్యాకేజ్ 21,22,23 ప్రాజెక్టు తీసుకువస్తే దానిని వారి స్వార్థాల కొరకు నిలిపివేశారన్నారు.

300 కోట్లతో అయిపోయే పనిని 3000 కోట్లు పెట్టీ కాంట్రాక్టులకు ఇచ్చారన్నారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలన్నారు.

ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరిచాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం అని తెలిపారు, భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము అన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ ,అభియాన్   కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి అన్నారు.  క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు తోట లక్ష్మీ కాంతారావు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జిల్లా ఇన్చార్జులు సత్యనారాయణ గౌడ్ వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మి, రాజు, మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు , మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి,మాజీ జెడ్పిటిసిలు నా రెడ్డి మోహన్ రెడ్డి, తిరుమల గౌడ్, మాజీ ఎంపీపీ లు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి లు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.