డెంగ్యూ నివారణలో భాగస్వాములు కావాలి
17-05-2024 12:51 AM
రాజన్న సిరిసిల్ల, మే 16 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ డెంగ్యూ నివారణలో భాగస్వాములు కావాలని జిల్లా వైద్యాధికారి ఎ సుమన్ మోహన్‌రావు కోరారు. గురువారం డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో పలు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డెంగ్యూ జ్వరం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, దోమల నివారణ చర్యలపై వివరించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




