నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూల్ విడుదల
05-07-2024 04:44 PM
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ వ్వవహారం కలకలం రేపుతోంది. పార్లమెంట్ లో సైతం ఈ అంశంపై పతిపక్షలు చర్చలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ-2024 పరీక్షషెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆగస్టు 11వ తేదీన రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీయే నిర్ణయించింది. గత నెల 23న జరగాల్సిన నీట్ పరీక్షను కేంద్రం ఒక రోజు ముందే ప్రకటిస్తూ వాయిదా వేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రివైజ్డ్ షెడ్యూల్ ను ప్రకటించింది.






