15 July, 2026 | 12:18 AM

నీట్ పరీక్షను రద్దు చేసేదే లేదు: కేంద్రం

05-07-2024 05:17 PM

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ వ్వవహారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ-2024 పరీక్ష షెడ్యూల్ ను ఎన్డీయే ప్రకటించింది. ఆగస్టు 11వ తేదీన నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించానున్నారు. నీట్ పరీక్షను రద్దు చేసేదిలేదని కేంద్రం ప్రభుత్వం తేల్చిచెప్పింది.

నీట్ అంశంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన కేంద్రం పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. నీట్ లీకేజీలో నిందితులను అరెస్టు చేశామని, నీట్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు కేంద్రం వెల్లడించింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని, నీట్ మొత్తం పరీక్షను రద్దు చేయడం సరికాదన్నారు. నీట్ రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని తెలిపింది.