నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్..! సుప్రీం కీలక నిర్ణయం
జూన్ 21న యథావిథిగా నీట్ రీ- ఎగ్జామ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో నీట్ యూజీ రీ-ఎగ్జామ్(NEET UG re-exam)కు లైన్ క్లియర్ అయింది. నీట్ ఎగ్జామ్ వాయిదా వేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. నీట్ పరీక్షపై(NEET exam) పలువురు అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విద్యార్థుల తరఫున న్యాయవాది వేసిన అత్యవసర పిటిషన్లపై విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విద్యార్థులు ఇప్పటికీ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్(Admit cards download) చేసుకోలేకపోతున్నారని న్యాయవాది అభ్యర్థించారు. న్యాయవాది అభ్యర్థనను సీజేఐ పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఈ నెల 21న ఆదివారం నీట్ రీ ఎగ్జామ్ యధాతథంగా జరగనుంది. నీట్ రీ ఎగ్జామ్ పై పలువురు అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఊరట దక్కలేదు.
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ కు షాక్..
అటు టెలిగ్రామ్ పై నిషేధం(Telegram Ban ) కేసులో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. టెలిగ్రామ్ పై నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ ధర్మాసనం కొట్టేసింది. నీట్ పరీక్ష కోసం టెలిగ్రామ్ యాప్(Telegram app)పై కేంద్ర నిషేధం విధించిన ముచ్చట తెలిసిందే. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ పై నిషేధం కొనసాగనుంది.
నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ముందు జాతీయ వైద్య కమిషన్ సలహా
జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ముందు, ఎన్‌ఎంసి (National Medical Commission) అన్ని వైద్య కళాశాలలకు సలహా జారీ చేసింది. పరీక్ష సమగ్రతను నిర్ధారించడానికి, కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని, అనుచితమైన పద్ధతుల పట్ల విద్యార్థులకు సలహా ఇవ్వాలని,అసాధారణమైన సందర్భాలు మినహా జూన్ 20-21 తేదీలలో సెలవు మంజూరు చేయవద్దని ఆదేశించింది.






