పటాన్‌చెరులో హైడ్రా దూకుడు... ఐలా స్థలానికి కంచె ఏర్పాటు
19-06-2026 02:45 PM
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఐలా (TGSILA)కు చెందిన 1,599 గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థలంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ పనులను నిలిపివేసిన అధికారులు, అక్కడ నిర్మాణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని యథాతథంగా ఉంచి చుట్టూ కంచె వేస్తున్నారు. కాగా, నిన్న ఉదయం ఈ స్థలాన్ని సందర్శించిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆలయ నిర్మాణాన్ని పరిశీలించి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.






