25 February, 2026 | 11:47 PM

ఎంజీఎంపై ఎందుకంత నిర్లక్ష్యం..?

27-10-2025 03:38 PM

హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఎంజీఎం హాస్పిటల్ పై ఎందుకంత నిర్లక్ష్యమని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రశ్నించారు. ఇటీవల ఎంజీఎం పిల్లల వార్డులో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక ఇద్దరు పిల్లలకి ఒకే సిలిండర్ ను అమర్చి తీసుకువెళ్లేటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరమైన విషయం తెలిసిందే  దీనినీ  దృష్టిలో ఉంచుకొని ఎంజీఎం పరిపాల తీరుపై శేషు మండిపడ్డారు. సుబేదారి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శేషు మాట్లాడుతూ పేద ప్రజలకి వైద్య సేవలు అందించే ఎంజీఎం హాస్పిటల్ లో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కథనాలు సామాజిక మాధ్యమాలలో వస్తున్నా కూడా  ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.

ఎంజీఎంలో వైద్య సదుపాయాలపైన డాక్టర్ల కొరత పైన అవినీతిపైన అనేక సందర్భాలలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం చూస్తుంటే ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లుగా కనపడుతుంది అన్నారు. గతంలో డాక్టర్ చంద్రశేఖర్ ఎంజిఎం సూపరిండెంట్ గా హాస్పటల్ ని చెక్కదిద్దే ప్రయత్నం చేస్తే,తనని రాజకీయ ఒత్తిడితో బదిలీ చేసిన తర్వాత ఎంజీఎం పరిస్థితి మరింత అద్వానంగా తయారైందని విమర్శించారు. ఎంజీఎం హాస్పిటల్ లోనే సరైన వైద్య సదుపాయాలు అందించలేని ప్రభుత్వం హాస్పటల్ ని నిర్వహించలేని వారు భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకి వైద్య సేవలు ఎలా అందిస్తారనే అనుమానాలు కలుగుతున్నాయని అభిప్రాయపడినారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎంజీఎం లో పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేసినారు.