27-10-2025 03:42:34 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్ సర్కిల్ ల పరిధిలోని 73 ఏ4 మద్యం దుకాణాలకు 1712 దరఖాస్తులు రాగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ లో గల పీవీఆర్ గార్డెన్స్ లో లక్కీ డ్రా కొనసాగుతుంది. ఉదయం నుంచి ప్రారంభమైన లక్కీ డ్రా సర్కిల్ ల వారిగా, ఒక్కొ దుకాణానికి వచ్చిన దరఖాస్తులను టోకెన్ ల వారిగా అందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎక్సైజ్ సూపరింటెండెంటు నంద గోపాల్ లు డబ్బాలో వేసి లాటరీ పద్దతిలో డ్రా తీసి దుకాణాదారులను గుర్తిస్తున్నారు.
లక్కీ తగిలినవారు ఆనందంగా వెళుతుండగా, లక్కీ తగలని వారు విషాదంగా గార్డెన్స్ నుంచి వెళుతున్నారు. చాలా వరకు సిండికేట్ గా వేయడంతో ఒక దుకాణం మిస్సయితే మరో దుకాణంలోనైనా లక్కీ తగలదా..! అని గార్డెన్ అవతల చర్చించుకుంటున్నారు. సాయంత్రం వరకు ఈ లాటరీ విధానం కొనసాగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు గురువయ్య (మంచిర్యాల), ఇంద్రప్రసాద్ (బెల్లంపల్లి), ఎం హరి (చెన్నూర్), ఎస్ సమ్మయ్య(లక్షెట్టిపేట), కందుల తిరుపతి, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులున్నారు.