calender_icon.png 27 October, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

27-10-2025 02:34:34 PM

చిట్యాల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పలువురు గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సాగర్ల భిక్షం ఆ పార్టీ కి రాజీనామా చేసి హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర డయిరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  గుత్తా అమిత్ కుమార్ రెడ్డి    నివాసంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి  అమిత్ కుమార్ రెడ్డి  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు జాల గోపాల్, జాల మల్లేష్, మాధగోని నాగయ్య, మాధగోని లింగ స్వామి, తదితరులు పార్టీలో చేరారు.