28 March, 2026 | 4:00 AM

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ప్రమాణం

28-03-2026 01:46 AM

ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

ఢాకా, మార్చి 27: రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ సమక్షంలో శీతల్ నివాస్‌లో నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా (35) శుక్రవారం ప్రమా ణ స్వీకారం చేపట్టారు. సుధీర్ఘకాలంగా రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న నేపాల్, జెన్‌వా తిరుగుబాటు అనం తరం పరిణామాలు పూర్తిగా మారి పోయాయి. ఖాట్మాండుకు చెందిన బాలేంద్ర షా దేశంలో అస్థిర రాజకీ యాలు,

అవినీతిని విమర్శిస్తూ తన గానం, కవితల ద్వారా వినూత్నరీతిలో ప్రచారం చేపడుతూ కొద్దికాలంలోనే యూత్ ఐకాన్‌గా మారారు. గతంలో ఖాట్మాండు మేయర్ గా ఎన్నికయ్యా రు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నిక ల్లో ఆర్‌ఎస్‌పీకి 182 స్థానాలు దక్కడం లో బాలేంద్ర షా కీలకపాత్ర పోషిం చాడు. నాలుగుసార్లు ఝపా నుంచి విజయం సాధిస్తూ వస్తున్న మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని భారీ మెజార్టీతో బాలేంద్ర ఓడించాడు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ నూతన ప్రధాని బా లేంద్ర షాకు అభినందనలు తెలిపారు. మీ నియామకం, మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. మన రెండు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనం కోసం భారత్- స్నేహం, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.