దద్దరిల్లిన పశ్చిమాసియా
- ఇరాన్ నివాసాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి
- 26 మంది మృతి.. వీరిలో ఏడుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు
- గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ పతీదాడి
- హైఫా పోర్ట్‌పై ఇరాన్ క్షపణి దాడి
- బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ధ్వంసం
- ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం: ఐడీఎఫ్ రక్షణ చీఫ్ కట్జ్
టెహ్రాన్/బీరుట్/జెరూసలెం, మార్చి 27: ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల శుక్రవారం పశ్చిమాసియా దద్దరిల్లింది. ప్రతీకార దాడలతో విరుచుకుపడ్డాయి. ఇరాన్‌పై ఇజ్రాయె ల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫహాసన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశా యి. నివాసాలపై దాడి చేయడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్‌లోని ఇస్ఫహాసన్ ప్రావిన్స్‌లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 26 మంది మరణించినట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో ఏడుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటి వరకు 1900 మందికి పైగా ప్రజలు మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్‌లో 18 మంది, గల్ఫ్‌లో 20 మంది మరణించారు. 13 మంది అమెరికా సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 1100 మందికి పైగా మరణించారి అక్కడి అధికారులు తెలిపారు.
ఇరాక్‌లో మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని.. దీర్ఘ, మధ్యశ్రేణి క్షిపణుల దాడులు చేసినట్లు ఐఆర్‌జీసీ పేర్కొంది. ఈ దాడుల్లో బహ్రెయిన్‌లోని అమెరికా పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వహణ కేంద్రం నాశనమైనట్లు తెలిపింది. అయితే భారతీయులకు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ.. టెహ్రాన్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు ఇరాన్ వినూత్నం గా కృతజ్ఞతలు చెప్పింది. క్షిపణిపై ‘భారత ప్రజలకు కృతజ్ఞతలు’ అనే సందేశాన్ని రాసి ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది.
స్పెయిన్, జర్మనీ, పాక్‌కు వంటి ఇతర దేశాలకు కూడా టెహ్రాన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసిం ది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇజ్రాయెల్ మీద ఇరాన్ విరుచుకుపడింది. కీలకమైన హైఫా పోర్ట్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసింది. నౌకాదళ మరమ్మతు కేంద్రా లు, లాజిస్టిక్స్ విభాగాలు, భారీ ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
ఇరాన్ డ్రోన్ సామర్థ్యం తగ్గిందన్న అమెరికా- వాదనలకు ఈ దాడి సమాధా నమని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్‌జీసీ) గురువారం తెల్లవారుజామున ఇజ్రా యెల్, అమెరికా స్థావరాలపై 82వ విడత ప్రతీకార దాడులను ప్రారంభించింది. హైఫా పోర్ట్‌తోపాటు డెడ్ సీ సమీపం లోని ఇజ్రాయెల్ అణు కార్యక్రమాలకు సంబంధించిన పరిశ్రమలు, సైనికకమాండ్ సెంటర్లపై దాడులు జరిపినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఇరాన్‌లో భూతల దాడికి ప్రయత్నిస్తే, అమెరికా- ఇజ్రాయెల్ దళాలకు నరకం చూపిస్తామని తీవ్రంగా హెచ్చరించింది.
ఇజ్రాయెల్ వైపు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, హైఫా రిఫైనరీ కాంప్లె క్స్ వద్ద మంటలు చెలరేగాయి. విద్యుత్ సరఫరాకు స్వల్పఅంత రాయం కలిగినా, పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల వల్ల హైఫా పోర్ట్ కార్యకలాపాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అదానీగ్రూప్ నిర్వ హిస్తున్న ఈ పోర్ట్ వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌కు ఎంతో కీలకం.
ఇరాన్‌పైకి 850కి పైగా క్షిపణులు
అమెరికా బలగాలు కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించి 28 రోజులు అవుతోంది. ఈ నాలుగు వారాల వ్యవధిలో అమెరికా 850కి పైగా తోమహాక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇలాం టి మరిన్ని క్షిపణులను వేసేందుకు చర్చలు జరిగాయని వాసింగ్టన్ పోస్టు పేర్కొంది.
ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం
ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని, వాటిని మరింత విస్తరిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఈ యుద్ధ నేరానికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని కట్జ్ తెలిపారు. టెహ్రాన్‌లోని బాలిస్టిక్ క్షిపణులు, ఆయుధాల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ, నిల్వ కేంద్రాలపై కూడా దాడులు చేసినట్లు వెల్లడించింది.
గల్ఫ్‌కు ఇరాన్ మరో వార్నింగ్
గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా నేవీ బేస్‌లను పలు గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నందున ఆ దేశాలపై దాడులకు దిగిన ఇరాన్ మరో సారి వారిని హెచ్చరించింది. తమతో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, అవి మూసుకోవాలని సూచించింది. ఒకవేల వారికి ఆశ్రయం ఇస్తే మాత్రం మరోసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
ఇరాన్ భూతలంలో కమ్ముకుంటున్న యుద్ధ బలగాలు
అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత 28 రోజులుగా జరుగుతన్న వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. అయితే ట్రంప్ ఓవైపు ఇరాన్‌కు షరతులు విధిస్తూ.. డెడ్‌లైన్ పొడిగిస్తూ.. మరో వైపు అమెరికా సైన్యాన్ని ఇరాన్‌పై మోహరిస్తూ.. ఇక భూతల యుద్ధమే వ్యూహం రచిస్తున్నారు. అందుకే ఇరాన్‌కు మరో 10 రోజుల గడువు ఇస్తూ.. ఏప్రిల్ 6 లోపు షరతులకు అంగీకరించాలని హెచ్చరించారు.
మరోపక్క ఇరాన్‌పై భూతల దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఖర్గ్ ద్వీపం టార్గెట్‌గా రెండు మెరైన్ గ్రూపులతోపాటు అదనంగా 7,000 మంది సైనికులు కూడా అగ్రరాజ్యం తరలిస్తోంది. ట్రంప్ పన్నాగాన్ని పసిగట్టి ఇరాన్ సిద్ధమవుతోంది. 10 లక్షల మంది సైన్యాన్ని ఏకం చేయడంతోపాటు ఐఆర్‌జీసీ, బసిజ్ ఫోర్స్ తదితర అనేక దళాలను బలోపేతం చేస్తోంది.
యుద్ధంలోకి ఇరాన్ 12 ఏళ్ల పిల్లలు సైతం దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా తమ బలగాలను సమీకరిస్తోంది. దీంతో భతల యుద్ధ వాతావరణం ఆసన్నమవుతున్నట్లు స్పష్టమవుతోంది.




