ఎలిగేడుకు కొత్త మార్కెట్.. రైతులకు మరింత మేలు!

12-09-2026 | 02:46pm

ఎలిగేడుకు నూతన వ్యవసాయ మార్కెట్

మార్కెట్ పాలకవర్గం నియామకం చైర్మన్ గా పొట్యాల రమేష్ 

పెద్దపల్లి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు(MLA Chintakunta Vijaya Ramana Rao) కృషితో ఎలిగేడులో నూతన వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటైంది. వ్యవసాయ శాఖ జీఓ నంబర్‌ 570 ద్వారా మార్కెట్‌ పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా పొట్యాల రమేష్, వైస్‌ చైర్మన్‌గా కోరుకంటి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. మార్కెట్‌ ఏర్పాటుతో స్థానిక రైతులకు పంటల విక్రయానికి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు