నేపాల్‌లో నవశకం! జెన్‌జీకి జై
- ర్యాపర్ బాలెన్ షా పార్టీ ఆర్‌ఎస్పీ ప్రభంజనం
నేపాల్ ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త పార్టీ హవా
రాత్రి వరకు ఆర్‌ఎస్పీ 62 స్థానాల్లో గెలుపు.. 60 స్థానాల్లో ముందంజ
మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై బాలెన్ షా భారీ లీడ్
కాఠ్మాండు, మార్చి 7: పొరుగు దేశం నేపాల్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా మారిన బా లేంద్ర (బాలెన్) షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) ప్రభంజనం సృష్టిస్తోంది. దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ వంటి ప్రధాన పార్టీలను వెనక్కి నెడుతూ ఆర్‌ఎస్పీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
దేశ పార్లమెంటులోని ప్రజా ప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలుండగా వాటిలో 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. 110 స్థానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నిక నిర్వహించారు. శనివారం రాత్రి వరకు వెల్లడైన ఫలితాలను బట్టి.. జెన్ జీ అభిమాన నాయకుడు, మాజీ కార్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) 6౨ సీట్లలో గెలుపొంది, మరో ౬0కిపైగా స్థానా ల్లో ముందంజలో ఉంది. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక సీటు గెలుపొంది, మరో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
మాజీ ప్రధానిపై బలేంద్ర షా ఆధిక్యం
జాపా-5 నియోజకవర్గంలో బలేంద్ర షా 55,934 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నా రు. మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ (నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ) 10,293 ఓట్లు మాత్రమే సాధించారు. శ్రమ్ సంస్కృతి పార్టీకి చెందిన సమీర్ తమాంగ్‌కు 6,324 ఓట్లు పడ్డాయి.
జెన్‌జెడ్ ఉద్యమంతో..
గత ఏడాది సెప్టెంబర్ 2025లో అవినీతికి వ్యతిరేకంగా, సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ యువత (జెన్-జెడ్) చేపట్టిన భారీ ఆందోళనల కారణంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ పరిణామాల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు, ముఖ్యంగా యువత మార్పు వైపే మొగ్గు చూపినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ నేత పుష్ప కమల్ దహల్ ’ప్రచండ’ తన స్థానంలో విజయం సాధించారు. తుది ఫలితాలు వెలువడేసరికి ఆర్‌ఎస్పీ భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




