సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తే అధిక లాభాలు
17-06-2026 05:38 PM
తాండూరు,(విజయక్రాంతి): సేంద్రియ ఎరువులు వినియోగించి పంటలు సాగు చేస్తేనే రైతులకు అధిక దిగుబడులు వచ్చి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని వికారాబాద్ జిల్లా కోటిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య అన్నారు. బుధవారం జాతీయ ఆహార భద్రత పథకం (NFSM) ద్వారా పెద్దముల్ రైతు వేదికలో రైతులకు చిరుధాన్యాలు పప్పు దినుసుల విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సహకరిస్తూ, ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అండగా ఉంటామని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ధారా సింగ్ నాయక్, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, పెద్దముల్ సర్పంచ్ డివై నర్సింలు, మండల వ్యవసాయ అధికారి ప్రీతం,AEO లు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.






