17 June, 2026 | 6:39 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన సత్తెనపల్లి సర్పంచ్

17-06-2026 05:43 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మండలం సత్తెనపల్లి సర్పంచ్ ఆనంద్ విజయ్ ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఉట్నూరులోని  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  సర్పంచ్ కు కండువా వేసి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జంగిలి శంకర్,కాంగ్రెస్ నాయకులు,సర్పంచ్లు తదితరులు ఉన్నారు.