28 August, 2026 | 1:56 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

జాతీయ కూరగాయల దినోత్సవం

17-06-2026 05:41 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి విద్యాసంస్థల్లో బుధవారం జాతీయ కూరగాయల దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులు క్యారెట్, టమాటా, వంకాయ, దోసకాయ, బీరకాయ వంటి కూరగాయల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆకర్షణీయ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించడంతో పాటు, అనుభవాత్మక అభ్యాసానికి ప్రోత్సాహం లభించింది.

పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ, “ఆరోగ్యకరమైన జీవనానికి కూరగాయలు ఎంతో అవసరం. చిన్నప్పటి నుంచే సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం చాలా ముఖ్యము” అని తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ జగదీష్ రెడ్డి, కరెస్పాండంట్ పోత రెడ్డి, ప్రిన్సిపాల్ శైల జాయ్ సన్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.