25 March, 2026 | 10:14 PM

గృహప్రవేశంతో నెరవేరిన సొంతింటి కల

25-03-2026 08:27 PM

చిట్యాల,(విజయక్రాంతి): పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసిన చెరుకు సైదమ్మ, సైదులు దంపతులను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు శాలువాతో సన్మానించారు.

అనంతరం లబ్ధిదారులకు ప్రోత్సాహకంగా  10,016 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతగా ఉంటామని అన్నారు.​ ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.