calender_icon.png 9 November, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోకాలి శస్త్రచికిత్సలో కొత్త ఆవిష్కరణలు

09-11-2025 12:00:00 AM

  1. ఆధునిక విధానాలపై చర్చలు

‘అపోలో’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ‘అడ్వాన్స్‌డ్ ఆర్థోపెడిక్స్ సింపోసియం నోవొటెల్ హోటల్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ శాస్త్రసదస్సులో మోకాలి శస్త్రచికిత్సలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, రో బోటిక్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత నిర్ధారణ పద్ధతులు, సంధి పరిరక్షణ వ్యూహాలపై నిపుణులు చర్చించనున్నారు.

దేశ విదేశాల నుం చి 250 మందికి పైగా ప్రముఖ ఆర్థోపెడిక్ శస్త్రవైద్యులు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు హాజరయ్యారు. అపోలో హాస్పిటల్స్ జా యింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగితారెడ్డి మా ట్లాడుతూ.. భవిష్యత్ ఆర్థోపెడిక్స్ ఖచ్చితత్వ శస్త్రచికిత్స, డిజిటల్ గైడెన్స్, వ్యక్తిగతీకృత చికిత్సలపైనే ఆధారపడి ఉందని  రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, ఏఐ రేడియాలజీ ఇంటిగ్రేషన్, పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ల రూపకల్పన వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు.

సదస్సులో శాస్త్ర కమిటీగా డా. జైరాం చందర్ పింగ్లే, డా. కె.జె.రెడ్డి, డా. సోమశేఖర్‌రెడ్డి, డా.ఎం. హరిశర్మ, డా. ఆర్.బాలవర్ధన్‌రెడ్డి, డా. రత్నాకర్‌రావు, డా. కౌశిక్‌రెడ్డి, డా. శ్రీధర్ సి.రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం మోకాలి రిప్లేస్‌మెంట్ పద్ధతుల్లో ఉభయదిశల నావిగేషన్, లిగమెంట్ స్పేరిం గ్ టెక్నిక్, కార్టిలేజ్ రీజనరేషన్, స్పోరట్స్ ఇంజరీ రిహాబిలిటేషన్‌పై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు.

అపోలో హాస్పిటల్స్ తెలంగాణ సీఈఓ తేజస్విరావు వీరపల్లి మాట్లా డుతూ.. రోబోటిక్స్, డిజిటల్ మెడిసిన్, 3డీ ప్రింటింగ్ ఇంప్లాంట్లతో మోకాలి శస్త్రచికిత్స ప్రపంచ స్థాయికి చేరిందన్నారు. రోగుల నడక, కదలిక, జీవన ప్రమాణాలను పెంచ డం మా ప్రధాన లక్ష్యం. అత్యాధునిక చికిత్సల్ని తెలంగాణకు అందిస్తుండటం గర్వకా రణం అన్నారు.

అపోలో మెడికల్ డైరెక్టర్ డా.రవికిరణ మాడ్లాడుతూ.. ఆదివారం లైవ్ సర్జరీ డెమోస్, క్లినికల్ చర్చలు, పునరావాసం, స్పోరట్స్ ఇంజరీ శాస్త్రంపై ప్రత్యేక సేషన్లు జరుగుతాయి. యువ శస్త్రవైద్యులకు శిక్షణ ఇచ్చే వేదికగా ఈ సింపోసియం నిలుస్తుంది అన్నారు.