09-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణం వీడీఓస్ కాలనీ లోని సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీల్లో ప్రతిభను చాటి, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టారు. కళా ఉత్సవ్ పోటీల్లో స్కిట్ విభాగంలో ఉమ్మడి జిల్లాల విద్యార్థులతో పోటీ పడి నాలుగవ స్థానంలో విజేత లుగా నిలిచారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ రంగాల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా సర్వజ్ఞ పాఠశాల డైరెక్టర్ ఆర్‌వి నాగేంద్రకుమార్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు విజేతలుగా నిలిచినం దుకు మెడల్స్‌తో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. “మన పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో విజయం సాధించి, రాష్ట్ర స్థాయిలో జరిగిన కళా ఉత్సవ్ పోటీల్లో పాల్గొనడం గర్వకారణం.
ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో, స్కిట్ విభాగంలో నాలుగో స్థానం సాధించడం చాలా గొప్ప విజయం” అన్నా రు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు విజేతలకు అభినంధనలు తెలిపారు.