09-11-2025 12:00:00 AM
4డీ ట్రూ బీమ్ రేడియేషన్ థెరపీ మెషిన్
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ఖమ్మం, పరిసర జిల్లాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి లేకపోవడంతో, రోగులు ఇప్పటివరకు హైదరాబాద్ లేదా విజయవాడకు వెళ్లి చికిత్స పొందాల్సి రావడాన్ని దృష్టిలో పెట్టుకొని జెమ్ కేర్ సంస్థ, జెమ్ కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను ఖమ్మంలో ప్రారంభించామని సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసకుమార్ రావిపాటి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా 4డీ ట్రూ బీమ్ రేడియేషన్ థెరపీ మెషిన్‌ను జెమ్ కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో (ఆరోగ్య హాస్పిటల్ ప్రాంగణంలో) అందుబాటులోకి తెచ్చామని శనివారం చెప్పారు.
ఇది ప్రపంచ స్థాయిలో అత్యాధునిక రేడియేషన్ ట్రీట్ మెంట్ టెక్నాలజీలలో ఒకటిగా నిలుస్తుందని, అదేవిధంగా అధునాతన పెట్‌సీటీ స్కాన్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ద్వారా ఖచ్చితమైన నిర్ధారణతో, వైద్యు లు ఖచ్చితత్వంతో చికిత్సను అందించగలుగుతారని డాక్టర్ శ్రీనివాసకుమార్ రావిపాటి వివరించారు. ఆరోగ్య హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సుమంత్ బాబు ఏం మాట్లాడుతూ.. ఖమ్మంలో క్యాన్సర్ సేవలు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు ౯౦ శాతం ప్రాముఖ్యత ఇస్తామని అన్నారు.
జెమ్ కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ అఫ్ రేడియేషన్ ఆంకాలజి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. క్యాన్స ర్‌కు అవహగానే ప్రధమ ఆయుధం అని ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చని ఆయన అన్నారు. ప్రతి జిల్లాలో తరచూ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటుచేసి ప్రజల్లో మరింత అవగాహనా పెం పొందించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. జెమ్ కేర్ సంస్థ కర్నూల్ సీనియర్ కన్సల్టెం ట్ జనరల్ ఫీజిషన్ అండ్ డాక్టర్ ఎస్‌వి చంద్రశేఖర్ మాట్లాడుతూ..
ఇది ఖమ్మంలో తొలి సమగ్ర క్యాన్సర్ కేంద్రంగా నిలుస్తుందన్నారు. స్టేట్ -అఫ్ -ది -ఆర్ట్ ఫెసిలిటీస్, కటిం గ్ -ఎడ్జి-టెక్నాలజీ, అనుభవజ్ఞులైన వైద్య బృం దం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా క్యాన్సర్ సేవలను అందిస్తామని తెలిపారు. అతి త్వరలో కర్నూ ల్‌లో సైతం ప్రారంభిచనున్నట్లు తెలిపారు. అనంతరం సంస్థ సిఓఓ శ్రీకాంత్ నంబూరి, సియం ఓ దినేష్ డి మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ రోగి-కేంద్రిత దృక్పథంతో పనిచేస్తుం దని, ఆధునిక సాంకేతికతను ప్రతి ప్రాంతానికి చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.