12-11-2025 04:34:13 PM
సభ్యత్వాలకు కృషిచేసిన క్రాంతిని సన్మానించిన సభ్యులు..
మంథని (విజయక్రాంతి): మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోతరవేని క్రాంతి ఆధ్వర్యంలో 32 మందికి నూతన మత్స్య కార్మికులకు సభ్యత్వాలు వాటి గుర్తింపు కార్డులను పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, జిల్లా అధికారి నరేష్ నాయుడు చేతుల మీదుగా బోయినిపేట లక్ష్మిదేవర గుడి ప్రాంగణంలో బుధవారం అందజేశారు. అనంతరం నూతన సభ్యత్వాల గురించి రెండు సంవత్సరాల నుండి జిల్లాలో మొదటి సారి సభ్యత్వాలు అందేలా కృషి చేసిన జిల్లా డైరెక్టర్ మంథని అధ్యక్షులు పోతరవేని క్రాంతిని నూతన సభ్యత్వాలు అందుకున్న మత్స్యకార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని మాజీ అధ్యకులు పోతరవేని లక్ష్మిరాజం, మంథని డైరెక్టర్లు కుంట బద్రి, సిలివేరి భూమన్న, బయ్యా రాజేష్ అధిక సంఖ్యలో మత్స్య కార్మికులు పాల్గొన్నారు.