5 March, 2026 | 7:29 PM

మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ అరెస్ట్

05-03-2026 05:41 PM

 మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. డి.ఎస్.పి రాజశేఖర్ రాజు 

మిర్యాలగూడ, (విజయక్రాంతి): మిర్యాలగూడలో మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ని మిర్యాలగూడ పోలీసులు(Miryalaguda Police) అరెస్టు చేశారు. గురువారం డిఎస్పి రాజశేఖర్ రాజు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మాడుగుల పల్లి మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన లొడంగి యాదగిరి మిర్యాలగూడ పట్టణంలో డిగ్రీ వరకు చదువుకున్నాడు.  హైదరాబాద్ లో పలు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేశారు. అనంతరం 2017లో మిర్యాలగూడ కు వచ్చి పలు ప్రవేట్ కంపెనీలలో పనిచేసేవాడు.2024 నుంచి మిర్యాలగూడ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలో గోల్డ్ షాప్ యజమానులు తన ముత్తూట్ ఫైనాన్స్ వద్దకు వస్తు ఎక్కువ మొత్తంలో డబ్బులు కస్టమర్ లపై పెట్టి లోన్ రిలీజ్ చేయి అట్టి బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో వారితో పరిచయం పెంచుకున్నాడు. శంకర్ అనే వ్యక్తి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడం కోసం వచ్చాడు. తనకు పరిచయస్తుడైన పోలేటి కనకాచారి ద్వారా మాడూరి ఉపేంద్ర చారిని పరిచయం చేసుకున్నాడు.

ఈ క్రమంలో తాకట్టులో ఉన్న కొంత బంగారాన్ని విడిపించడం కొరకు శంకర్ కరెంట్ అకౌంట్ పనిచేయడం లేదని మాయ మాటలు చెప్పి ఉపేంద్ర చారి అకౌంట్ నుంచి రూ .9,60,000 యాదగిరి తన ఎకౌంటు లోకి ఏపిచ్చుకున్నాడు. ఎకౌంట్లో డబ్బులు పడగానే సదురు వ్యక్తి బంగారం రిలీజ్ ప్రాసెస్ కొరకు బ్యాంకుకు వెళ్ళగా అక్కడ నిందితుడు తన అకౌంట్లో ఉన్న డబ్బులు సెండ్ కావడం లేదని మాయ మాటలు చెప్పి రేపు రావాలని సూచించాడు. ఇలా మోసం చేసిన డబ్బులను నిందితుడు క్రికెట్ బెట్టింగ్లో పెట్టాడు.

మోసపోయానని గ్రహించిన బాధితుడు ఉపేంద్ర చారి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు నీ పట్టుకొని తమదైన శైలిలో విచారించగా నేరాలను ఒప్పుకున్నాడు. గతంలో కూడా యాదగిరి ఇదేవిధంగా సుధీర్ కుమార్ అనే వ్యక్తిని నమ్మించి మోసం చేసినట్లు వివరించారు. నిందితుడి వద్ద నుంచి రూ.400000, వివో ఫోన్ స్వాదీన మార్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ఎం నాగభూషణరావు, ఎస్సై  ఏ. సైదిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్స్ వీరబాబు, ప్రసాద్, నరసింహ లను మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.