నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ
స్తూపం ఆవిష్కరణ, సంస్మరణ సభలో వక్తల నివాళి
మునుగోడు,(విజయక్రాంతి): నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్తగా పనిచేసిన కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ లేకపోవడం పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా, విజ్ఞాన దర్శిని ఫౌండర్ రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో ముత్తమ్మ స్తూపం ఆవిష్కరణ అనంతరం డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అధ్యక్షతన సంస్మరణ సభ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ భర్త మాజీ సర్పంచ్ సింగపంగా నరసింహ మరణించిన తర్వాత కూడా కుటుంబ, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ముత్తమ్మ పార్టీ ఆశయాల కోసం నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు.
అంగన్వాడి ఆయాగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, ప్రజలు రాజ్యాంగంపై అవగాహన పెంచుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సైన్స్ కమ్యూనికేషన్ సబ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, సమత సబ్ కమిటీ సభ్యురాలు ప్రొఫెసర్ విజయలక్ష్మి, జెవివి రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిత విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మ, సిపిఎం జిల్లా నాయకులు చాపల మారయ్య, మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, గ్రామ కార్యదర్శి పగిళ్ల మధు, సీనియర్ నాయకులు నారగోని నరసింహ, అయితగొని యాదయ్య, సింగపందు గౌరయ్య, సింగపంగా ఎల్లయ్య, బొందు సుందరయ్య, కట్ట ఆంజనేయులు, విజయ్ కుమార్, విజయ, యాదయ్య, అలివేలు తదితరులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.




