5 July, 2026 | 5:54 PM

Breaking News

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి   •   పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి   •   ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి   •   మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం   •   బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి   •   రామేశ్వరం ఆర్టీసీ బస్సు   •   జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి   •   పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం   •   ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం   •  

వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి

05-03-2026 05:39 PM

వైద్యాధికారిణి దివ్య

భిక్కనూర్, మార్చి05,(విజయ క్రాంతి): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారిణి దివ్య సూచించారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ‘ఆశా డే’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఇంటింటికీ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ వెంకటరమణతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.