3 August, 2026 | 11:11 PM

రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నిక

03-08-2026 10:07 PM

ఏఐటీయూసీ రంగారెడ్డి  జిల్లా అధ్యక్షులుగా వడ్ల సత్యనారాయణ

జిల్లా ప్రధాన కార్యదర్శిగా దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

తుక్కుగూడ,(విజయక్రాంతి): తుక్కుగూడ పట్టణంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యులు నెల కంటి సత్యం,  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్  హాజరైనారు. మహాసభలలో జిల్లా నలుమూలల నుండి 250 మంది ప్రతినిధులు అనేక సమస్యలపై తీర్మానాలు చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తు కర్తవ్యం మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది.

ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులుగా వడ్ల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీ.దత్తు నాయక్   9మంది ఆఫీస్ బేరర్స్,  35 మంది కార్యవర్గ సభ్యులుగా, 57 మంది కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా మహాసభ ప్రతినిధులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బీ దత్తు నాయక్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నాకు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన బాధ్యతను కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం కార్మిక హక్కుల కోసం పోరాడుతామని, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నాయకత్వం  పానుగంటి పర్వతాలు రామస్వామి మిగతా ఆఫీస్ బేరర్లకు ప్రత్యేకమైనటువంటి  తెలియజేశారు.