3 August, 2026 | 11:03 PM

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి రిమాండ్

03-08-2026 10:01 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని పెద్దలోడి గ్రామం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అధికారికి విధుల పట్ల ఆటంకం కలిగించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. ఇందుకు  సంబంధించి మునిపల్లి ఎస్సై అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దలోడి గ్రామానికి చెందిన పత్తి సంగమేశ్వర్ అనే వ్యక్తి అదే గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అధికారికి పలుమార్లు విధుల పట్ల ఆటంకం కలిగించాడు.

దీంతో విసుకు చెందిన ఆ అధికారి స్థానిక పోలీసులను ఆస్కరించాడు ఈ మేరకు మునిపల్లి పోలీసులు విచారణ జరిపి సదర వ్యక్తిపై కేసు నమోదు చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు ఈ మేరకు జడ్జి లక్ష్మీ కళ కేసును పరిశీలించి సదర వ్యక్తిని జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు జడ్జ్ ఆదేశాల మేరకు కంది జైలుకు సంగమేశ్వరును తరలించినట్టు మునిపల్లి ఎస్సై అరవింద్ తెలిపారు.